రెజినాకు మెగా ఛాన్స్..?

ఈమధ్య కెరియర్ లో వెనుకపడ్డ రెజినా కసాండ్రాకు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చిందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. లాస్ట్ ఇయర్ వరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన రెజినా లాస్ట్ ఇయర్ అ!, ఎవరు సినిమాలతో హిట్ అందుకుంది. ఆ రెండు సినిమాలు హిట్టైనా సరే రెజినాకు వరుసగా అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక లేటెస్ట్ గా అమ్మడికి ఓ మెగా ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో రెజినా స్పెషల్ సాంగ్ చేస్తుందట.

ఖైది నంబర్ 150లో రత్తాలు పాట సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అలానే కొరటాల శివ, చిరు కాంబో మూవీలో కూడా రెజినా ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ లో రెజినా చిరుతో కలిసి స్టెప్పులేస్తుందట. చిరు గ్రేస్ కు తగినట్టుగా మ్యాచ్ చేయడం కష్టమే కాని రెజినా ఈ ఆఫర్ తో రెజినాలో జోష్ వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాను రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది.