కథను బట్టే హీరో.. కొత్తవాళ్లంటే కష్టమే కాని..!

రాజమౌళి సినిమా అంటేనే విజువల్ గ్రాండియర్ అని చెప్పొచ్చు. ఆయన సినిమా అంటేనే నిర్మాతల కన్నా స్టార్స్ వచ్చిన అవకాశం ఇస్తారు. అలాంటి రాజమౌళికి కొత్త వాళ్లతో సినిమా చేసే అలవాటు ఉందా లేదా అంటే ఆయన సమాధానం ఎలా ఇలా ఉంది. కొత్త హీరోతో సినిమా చేయను అనేదేమి లేదు.. ఏదైనా కథ మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు రాజమౌళి. కొత్త వాళ్లతో చేస్తే ఎక్కువ రీచ్ ఉండదని అనారు.  

అయితే కొత్త వాళ్లతో సినిమా తీస్తే రేంజ్ తగ్గిపోతుందని తాను అసలు ఆలోచించనని.. కొత్త హీరోని పెట్టి సినిమా తీసి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆలోచించనని అన్నారు రాజమౌళి. కీరవాణి తనయుడు హీరోగా వచ్చిన మత్తువదలరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి వ్యాఖ్యాతగా చిత్రయూనిట్ ఇంటర్వ్యూ జరిగింది. అయితే పనిలో పనిగా రాజమౌళిని అడగాల్సినవి అడిఏశారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాం చ్రణ్ ఆ సినిమాలో కలిసి నటిస్తున్నారు.