
తమిళ దర్శకుడు మురుగదాస్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. కేవలం తమిళంలోనే కాదు తెలుగు, హింది భాషల్లో సినిమా చేశాడు మురుగదాస్. తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలు చేసిన మురుగదాస్ ఇక్కడ ఆడియెన్స్ నాడి పట్టుకోలేకపోయాడు. హిందిలో గజినితో సక్సెస్ కొట్టినా ఆ తర్వాత అక్కడ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినికాంత్ తో దర్బార్ సినిమా చేస్తున్నాడు మురుగదాస్.
ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ తెలుగు మీడియాతో మాట్లాడారు. తెలుగు ఆడియెన్స్ కు నచ్చేలా సినిమా తీయడంలో తాను విఫలమయ్యానని అన్నారు. ఇక దర్బార్ సినిమా ఆ కల నెరవేరుస్తుందని అన్నారు. తెలుగులో ఎన్.టి.ఆర్ కు ఓ కథ సిద్ధం చేసినట్టు చెప్పిన మురుగదాస్ త్వరలో ఎన్.టి.ఆర్ ను కలిసి కథ వినిపిస్తానని అన్నారు.