
రితేష్ రానా డైరక్షన్ లో కీరవాణి తనయుడు సింహా హీరోగా వచ్చిన సినిమా మత్తువదలరా. లాస్ట్ ఫ్రైడే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియెన్ సూపర్ అనేస్తున్నారు. ముఖ్యంగా సినిమా డైరక్టర్ ప్రతిభ గురించి స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా చూసి స్పెషల్ గా ఈ సినిమా గురించి మాట్లాడారు.
ఆ లిస్ట్ లో ప్రభాస్ కూడా చేరాడు. మత్తువదలరా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన ప్రభాస్ సినిమా బాగా నచ్చడంతో చిత్రయూనిట్ ను కలిసి విష్ చేశారు. సినిమా చాలా నచ్చిందని అన్నారు. రితేష్ రానా ఈ సినిమా బ్రీఫ్ స్టోరీని ముందే వీడియో తీసి చూపించడం జరిగింది. ఇలాంటి సినిమా తీసినందుకు దర్శకుడిని.. నటించిన వారిని.. సినిమా నిర్మించిన చెర్రి, మైత్రి మూవీ మేకర్స్ వారిని మెచ్చుకున్నారు ప్రభాస్.