
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా మూడు హైలెట్స్ ఉంటాయని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుందట. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్ అదిరిపోతుందట. అంతేకాదు సినిమాలో లీడ్ యాక్టర్స్ కామెడీ ఎపిసోడ్ ఒకటి బాగా వచ్చిందని తెలుస్తుంది. శ్రీకాకుల యాసలో ఈ ఎపిసోడ్ అదిరిపోతుందని తెలుస్తుంది.
అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు పోటీగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా వస్తుంది.