
హీరోలు నిర్మాతలుగా మారడం ఇప్పుడొక ట్రెండ్ గా మారింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు. మహేష్, రాం చరణ్ ఇద్దరు సొంత బ్యానర్ లు పెట్టుకున్నారు. వీరి దారిలోనే మరికొంతమంది హీరోలు ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుని నిర్మాతలుగా మారుతున్నారు. లేటెస్ట్ టాక్ ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా సొంత బ్యానర్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ నందమూరి హీరోలైన కళ్యాణ్ రాం, బాలకృష్ణ ఇద్దరు చెరో బ్యానర్ పెట్టారు. ఇక ఇప్పుడు తారక్ కూడా సొంత ప్రొడక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే బ్యానర్ పేరు కూడా డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. భార్గవ్ హరి ప్రొడక్షన్స్, అభయ హరి ఆర్ట్స్ ఈ రెండు పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేసే సినిమాకు తారక్ నిర్మాతగా ఉంటాడని తెలుస్తుంది.