2020లో ప్రభాస్ మ్యారేజ్..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మ్యారేజ్ పై ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. బాహుబలి రిలీజ్ ముందే ప్రభాస్ పెళ్లిపై వార్తలు రాగా బాహుబలి ముగిశాక ఇక పెళ్లే అన్నారు. ఇక ఆ సినిమా తర్వాత సాహో కూడా చేశాడు కాని ప్రభాస్ పెళ్లి కాలేదు. ఛాన్స్ దొరికితే అనుష్కతో ప్రభాస్ తో పెళ్లంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయడమే కొందరి పని అయ్యింది.

ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి వస్తుందని అంటున్నారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 2020 లో ప్రభాస్ మ్యారేజ్ జరుగుతుందని అన్నారు. మరి శ్యామలా దేవి చెప్పినట్టుగా అయినా ప్రభాస్ పెళ్లి జరుగుతుందా లేదా అన్నది చూడాలి.