
సీనియర్ స్టార్ హీరోలలో కింగ్ నాగార్జున ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే. చిరు పదేళ్ల గ్యాప్ లో వెంకటేష్, బాలయ్య బాబు ఫాం లో లేని టైంలో వరుస హిట్లతో దూసుకెళ్లాడు నాగార్జున. అంతేకాదు సీనియర్ స్టార్స్ తో 50 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి హీరో కూడా నాగార్జున మాత్రమే. అయితే బిగ్ బాస్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆ రికార్డ్ ఆయన మీద రాసుకున్నాడు.
ఇదిలాఉంటే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని నాగార్జున లేటెస్ట్ గా ఓ క్రేజీ మూవీతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మన్మథుడు 2 డిజాస్టర్ కాగా బిగ్ బాస్ సీజన్ 3 కోసం సినిమాలకు దూరంగా ఉన్నాడు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టనున్నాడు. ప్రస్తుతం నాగార్జున సోల్మాన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఈమధ్యనే మొదలైంది.