
మీరు మెగా అభిమానా.. అయితే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి యువత ఓ మహత్తర కార్యానికి నాంధి పలికారు. చిరంజీవి అభిమానులు ఏ ప్రాంతం వారైన సరే వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏర్పాటు చేస్తున్నారట. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ అభిమాని కుటుంబాన్ని ఆదుకునేలా ఈ భీమా ఉపయోగపడుతుంది. చిరు స్థాపించిన బ్లడ్ బ్యాంక్, నేత్ర నిధి సక్సెస్ అవడంలో మెగా అభిమానులే కారణం.
అలాంటి అభిమానుల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా ప్లాన్ చేయడం నిజంగా గొప్ప ఆలోచన. అయితే దీని కోసం మెగా అభిమానులను తన వివరాలను ఈమెయిల్ చేయాలని కోరారు నిర్వాహకులు. ఈ మెయిల్ కు మెగా అభిమానుల పూర్తి వివరాలు పంపిస్తే ఇన్సూరెన్స్ కు సంబందించిన ఏర్పాట్లు చేస్తారట. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి తెలుసుకున్న మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.