వాళ్ల కన్నా తక్కువే ఇస్తున్నారు..!

ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న మ్యూజిక్ డైరక్టర్ థమన్ అంతకుముందు వారం వెంకీమామ, లాస్ట్ వీక్ ప్రతిరోజూ పండగే సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో తన సత్తా చాటుతున్నాడు థమన్. ఈ సినిమాలో ఒక్కో పాట అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే బయట వారి కన్నా తను రెమ్యునరేషన్ విషయంలో అంత సీరియస్ గా ఉండనని.. మిగతా వారు తీసుకునే దానికన్నా 50 శాతం మాత్రమే తీసుకుంటానని అన్నాడు థమన్.

అలా చూస్తే నేను ఎంతో ఉత్తమమని అంటున్నాడు థమన్. ఇక హైదరాబాద్ లో బెస్ట్ సింగింగ్ టీం ఉంది.. అయితే రికార్డింగ్ మాత్రం చెన్నైలో చేస్తానని.. స్టూడియోలోనే ఎక్కువ టైం కేటాయిస్తానని అన్నాడు థమన్. చివరి రీల్ అమెరికా వెళ్లేంత వరకు డైరక్టర్ పక్కనే ఉంటానని అన్నారు థమన్. అల వైకుంఠపురములో సినిమాతో థమన్ తన కెరియర్ బెస్ట్ ఇచ్చాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.