
యువ హీరో నాగ శౌర్య హీరోగానే కాదు కథ కూడా అందించి నిర్మిస్తున్న సినిమా అశ్వద్థామ. రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. లవర్ బోయ్ ఇమేజ్ తో సినిమాలు చేసే నాగ శౌర్య మొదటిసారి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పొచ్చు. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ముఖ్యంగా డైలాగ్స్ ఎక్కువ ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా హార్డ్ వర్క్ చేశాడు. లవర్ బోయ్ నుండి యాక్షన్ హీరోగా తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు వస్తున్న నాగ శౌర్యకు ఈ అశ్వద్థామ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సినిమాలో నాగ శౌర్యకు సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. ఛలో తర్వాత హిట్టు కోసం తపిస్తున్న నాగ శౌర్యకు ఈ అశ్వద్థామ గట్టేక్కిస్తుందో లేదో చూడాలి.