
2020 సంక్రాంతికి సినిమాల పండుగ కూడా భారీగా ఉండబోతుంది. ఓ పక్క సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరుతో వస్తుండగా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ క్రేజ్ తెచ్చుకోగా ఈ సినిమాల బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ రెండు సినిమాలు 225 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.
మహేష్, అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది. ఈ సినిమా 100 కోట్ల పైగా బిజినెస్ చేసిందట. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా 93కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. ఇక సంక్రాంతికి వస్తున్న రజినికాంత్ దర్బార్ సినిమా 10 కోట్లు, కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా 15 నుండి 20 కోట్ల బిజినెస్ చేస్తుందట. మొత్తంగా సంక్రాంతికి 225 కోట్ల పైగా బిజినెస్ చేశాయని తెలుస్తుంది. మరి ఈ సినిమాల కలక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.