పవన్ సినిమా.. చరణ్ వేట మొదలుపెట్టాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా కూడా క్రిష్ తో డిస్కషన్స్ లో ఉన్నాడు. వీటితో పాటుగా బాబాయ్ తో తన సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ముందే ఎనౌన్స్ చేశాడు రాం చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే చరణ్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాం చరణ్ హీరోగా ఈ సినిమా చేస్తూనే నిర్మాతగా కొరటాల శివ, చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ కోసం కథలను వింటున్నాడట. సరైన కథ దొరికితే చరణ్ నిర్మాణంలో పవన్ హీరోగా సినిమా ఎనౌన్స్ మెంట్ చేస్తారని తెలుస్తుంది. మరి పవన్, చరణ్ కాంబోలో ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి.