
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో మహేష్ తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తాడట. డ్యాన్స్ విషయంలో మహేష్ పై ట్రోలింగ్స్ సర్వసాధారణమే. అయితే ఈ ట్రోల్స్ సీరియస్ గా తీసుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరులో డ్యాన్స్ అదరగొడతాడట.
మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ మైండ్ బ్లాంక్ అయ్యే స్టెప్పులు చేస్తాడని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ కంపోజ్ చేశారట. సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ యాక్షన్, డైలాగ్స్, కామెడీ టైమింగ్ తో పాటుగా డ్యాన్స్ కూడా దుమ్ము దులిపేస్తాడని తెలుస్తుంది. మరి మహేష్ అదరగొట్టే డ్యాన్స్ చూడాలంటే సక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.