
ఇష్టం సినిమాతో పరిచయమై 15 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న హీరోయిన్ శ్రీయ శరణ్. ఇప్పటికి సీనియర్ స్టార్స్ తో జోడీ కడుతున్న ఈ అమ్మడు తన పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచింది. రెండేళ్ల క్రితం రష్యన్ టెన్నీస్ ప్లేయర్, బిజినెస్ మెన్ కౌశివ్ ను పెళ్లాడింది శ్రీయ శరణ్. అయితే ఈమధ్య మీరు అంత సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడుగగా అందులో దాచుకోవాల్సింది ఏమి లేదు.. నా జీవితాన్ని ప్రైవేట్ గా సింపుల్ గా ఉంచుకుంటాను.. నటన అనేది నాకు ఫుడ్ అని భావిస్తాను.. అందుకే సినిమాల్లో కొనసాగుతా అన్నది శ్రీయ.
తన భర్త కూడా తనకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారని.. తను బిజీగా ఉండటం ఆయనకు ఆనందాన్ని ఇస్తుందని అన్నారు శ్రీయ శరణ్. ఇందులో నో సీక్రెట్స్ అంటుంది అమ్మడు. ఈ ఇయర్ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించిన శ్రీయ సీనియర్ హీరోలకు మొదటి ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులోనే కాదు తమిల, హింది భాషల్లో కూడా నటిస్తుంది.