
కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఎలా ఉంటుంది. కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాదు మునుపటి క్రేజ్ ను.. అవార్డులు రివార్డులు తెస్తే ఇక ఆ ఎంజాయ్ వేరేలా ఉండదు. ప్రస్తుతం ఈ హ్యాపీ మూడ్ అంతా సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష సొంతమని చెప్పొచ్చు. తమిళంలో 2018 అక్టోబర్ 4న రిలీజైంది 96 మూవీ. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి మేల్ లీడ్ గా చేశాడు.
సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవడమే కాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. రీసెంట్ గా త్రిష ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. ఏషియన్ అవార్డ్స్ నుండి ఫిల్మ్ ఫేర్ వరకు 96 సినిమా ఒక్కదానికే 11 అవార్డులు అందుకుందట త్రిష. ఏ ముహుర్తాన త్రిష ఆ సినిమా ఓకే చెప్పిందో కాని ఆమెను మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకురావడమే కాకుండా ఎన్నో అవార్డులు తెచ్చిపెడుతుంది.