
సూపర్ స్టార్ మహేష్ తో ఫోటో దిగే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. స్టార్స్ తమ ఫ్యాన్స్ ను కలిసే ఈ సరికొత్త కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. మహేష్ తో ఫ్యాన్స్ ఫోటో సెషన్ అంటూ సరిలేరు నీకెవ్వరు న్రిమాతల్లో ఒకరన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ మహేష్ తో ఫ్యాన్ ఫోటో సెషన్ కు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.
మహేష్ తో ఫోటో అంటే మాములు విషయమా.. అయితే ఈ ఫోటో సెషన్ కు ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేదట. దానితో మహేష్ ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. ఇద్దరి ఫ్యాన్స్ కాళ్లు విరిగినట్టు సమాచారం. అంతేకాదు ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తున్న కొంతమంది నిర్వాహకులు ఫ్యాన్స్ దగ్గర డబ్బులు వసూళు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కాన్సెప్ట్ తో ఏదో తన ఫ్యాన్స్ ను కలిసి వారితో ఫోటో దిగి వారి సంతోషానికి కారణమవుదామని అనుకున్న మహేష్ కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది.