
ఈమధ్య సక్సెస్ ఫుల్ సినిమాలను అందించడంలో వెనుకపడ్డ కింగ్ నాగార్జున మన్మథుడు 2 తర్వాత చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వల్ గా బంగార్రాజు సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమా చేశాడు నాగార్జున. లేటెస్ట్ గా సోలొమాన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
రగడ, మిస్టర్ పర్ఫెక్ట్, ఊపిరి సినిమాలకు రైటర్ గా పనిచేసిన సోలొమాన్ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున సినిమాకు ఓకే చెప్పారట. ఈ మూవీలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో ఎన్ కౌంటర్ శంకర్ రోల్ లో నాగార్జున నటిస్తున్నారట. ఈ సినిమాను జనవరి 18న మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడవుతాయి.