
మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడం సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ ఉండటంతో వసూళ్లు బాగున్నాయి. శుక్రవారం నుండి బుధవారం వసూళ్లతోనే బ్రేక్ ఈవెన్ వచ్చిందని తెలుస్తుంది.
ఈ సినిమా 18 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. బుధవారం వరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో 12 కోట్లు మిగతా ఏరియాల్లో 5 కోట్ల వరకు వసూళు రాబట్టిందట. మొత్తంగా పతిరోజూ పండగే ఆరు రోజులకు 17 కోట్లు వసూళు చేసిందని తెలుస్తుంది.
ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు చూస్తే :
నైజాం: 5.37 కోట్లు
సీడెడ్: 1.52 కోట్లు
వైజాగ్: 1.87 కోట్లు
గుంటూరు: 0.87 కోట్లు
ఈస్ట్: 0.92 కోట్లు
వెస్ట్: 0.70 కోట్లు
కృష్ణ: 0.87 కోట్లు
నెల్లూరు: 0.43 కోట్లు
ఏపీ/తెలంగాణ : 12.55 కోట్లు