.jpeg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా పింక్ రీమేక్ కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఆ సినిమా నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా పవన్ ఓకే చేశాడో లేదో తెలియదు కాని కథ మాత్రం లీక్ అయ్యింది. సినిమాలో పవన్ దొంగగా కనిపిస్తాడట. డిటెక్టివ్ నవలా రచయిత మధుబాబు షాడో తరహా పాత్రలో పవన్ కనిపిస్తాడని తెలుస్తుంది. పవన్ ఇంకా ఓకే చెప్పలేదు కాని ఈ సినిమా లీకులపై క్రిష్ సీరియస్ అవుతున్నాడు.తన టీమ్ నుండే ఈ లీకులు జరుగుతున్నాయని తెలియడంతో అందరికి వార్నింగ్ ఇచ్చాడట క్రిష్. ఇంతకీ క్రిష్ కథను పవన్ ఓకే చేస్తాడా లేదా అన్నది చూడాలి.