.jpeg)
సూపర్ స్టార్ మహేష్ హీరోగా 26వ సినిమాగా వస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా 2020 జనవరి 11న రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా లోని 3 సాంగ్స్ ఇప్పటికే రిలీజై అంచనాలను అందుకోగా లేటెస్ట్ గా ఈ సినిమా నుండి టైటిల్ యాంతం రిలీజ్ చేశారు.
సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చిన ఈ టైటిల్ యాంతం సినిమాపై మరింత అంచనాలు పెంచింది. అయితే ఈ సాంగ్ కంపోజింగ్ ఫారిన్ లో చేశాడు దేవి. సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. సైనికుడి గురించి చెబుతూ వచ్చిన ఈ సాంగ్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. సినిమాలో విజయశాంతి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.