.jpeg)
66వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మహానటి, రంగస్థలం సినిమాలకు అవార్డుల పంట పండింది. మహానటి సినిమాకు నాలుగు కేటగిరిలో అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రంగా మహానటి, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్ అవార్డులు అందుకున్నారు. వీటితో పాటుగా ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాకు గాను అందుకున్నారు.
ఇక ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో చిట్టి బాబు కూడా చితకొట్టాడు. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్, బెస్ట్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్ట్ విభాగాల్లో కూడా రంగస్థలం అవార్డులు అందుకుంది. కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాదు అవార్డుల్లో కూడా రంగస్థలం సత్తా చాటుతుంది.