మెగా సూపర్ స్టార్స్.. ఇద్దరు కలిస్తే చరిత్రే..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని తెలిసిందే. మెగా సూపర్ స్టార్ కలయికతో జరుగనున్న ఆ వేడుక చాలా స్పెషల్ కానుంది. 

ఇక ఈ క్రేజీ ఈవెంట్ పై అటు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా అంచనాలు పెట్టుకున్నారు. లేటెస్ట్ గా నమ్రత చిరుతో మహేష్ ఉన్న పిక్ షేర్ చేసి క్రేజీ కామెంట్ పెట్టింది. 

ఒకేరకమైన ఆలోచనలు ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిస్తే మిగతాది అంత చరిత్రే.. జనవరి 5.. డేట్ సేవ్ చేసుకోండి అంటూ చిరు, మహేష్ కలిసి మాట్లాడిన పిక్ షేర్ చేసింది.అయితే ఈ పిక్ లో మహేష్ చిరు ఎవరు కనిపించకుండా ఫోటో తీయడం విశేషం. మరి జనవరి 5 న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.