ప్రతిరోజూ పండగే సినిమాకి పరుచూరి ప్రశంసలు

సాయి తేజ్,  మారుతి కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ కారణంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ థ్యాంక్స్ మీట్ లో సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. 

సినిమా చుసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ మూవీని తాత మనవడు.. కలిసుందాం రా.. సినిమాలకు జత చేశారు. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమా చేసిన మారుతికి కృతజ్ఞతలు తెలిపారు గోపాలకృష్ణ. సినిమాలో నటించిన నటీనటులు కూడా చాలా చక్కగా చేశారని అన్నారు. తన జీవితంలో వాళ్ల అమ్మ గారు గురించి చెప్పి అందరిని సర్ ప్రైస్ చేశారు. సినిమా లో విజ్ఞానం, వినోదం, వికాసం మూడు ఉన్నాయని అందుకే సినిమా ఇంత మంచి విజయం అందుకుందని అన్నారు గోపాలకృష్ణ.