అర్జున్ రెడ్డి డైరక్టర్ తో బాహుబలి

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరచినా బాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ప్రభాస్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తీస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఈ మూవీ తర్వాత ప్రభాస్ తో సినిమా కోసం డైరక్టర్లు క్యూ కడుతున్నారు. శంకర్ తో పాటుగా ధూమ్ 4 లో కూడా ప్రభాస్ ఉంటాడని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ తో సినిమాకు తాను రెడీ అంటున్నాడు సందీప్ వంగా. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్న సందీప్ వంగా అదే సినిమా హిందీలో తీసి అక్కడ సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రణ్ బీర్ సింగ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న సందీప్ వంగా తన తర్వాత సినిమా ప్రభాస్ తోనే అంటున్నాడు. అంతకుముందు మహేష్ తో సినిమా అంటూ సందీప్ హడావిడి చేశాడు అది అటకెక్కగా ప్రభాస్ సినిమా అయినా వస్తుందో లేదో చూడాలి.