.jpeg)
కన్నడలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కన్నడలోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లో హిట్ అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా కెజిఎఫ్ 2 వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన యష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంచనాలku తగినట్టుగానే యష్ లుక్ ఉంది.
గోల్డ్ ఫీల్డ్ లోని కూలీలతో ఒక భారీ స్థంబాన్ని నిలబెట్టే పోస్టర్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తే బాహుబలిలో భళ్లాలదేవుడి విగ్రహాన్ని నిలబెట్టే బాహుబలి స్టిల్ లా ఉంది. ఈ పోస్టర్ లో యష్ మోడరన్ లుక్ తో సిగరెట్ తాగుతూ కనిపించాడు. కెజిఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.