.jpeg)
యువ హీరో అడివి శేష్ తన ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా చేస్తాడు. మేజర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను జిఎంబి బ్యానర్ లో మహేష్ బాబు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ముంబై 26/11 దాడుల నేపథ్యంలో సందీప్ ఉన్ని కృష్ణన్ కథతో ఈ సినిమా వస్తుంది. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే అలియా భట్ అయితే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని ఆమెని అడిగారట. ప్రస్తుతం అలియా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటుగా రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా నటిస్తుంది. అడివి శేష్ మేజర్ ఆఫర్ ను అలియా ఓకే చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.