వేలు పెట్టుడు ఎక్కువైందా..!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని హారిక హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. 

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ వేలు పెట్టుడు ఎక్కువైందని అంటున్నారు. ఈ మూవీలో టబు,  సుశాంత్, నివేద పేతురాజ్ కూడా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. సంక్రాంతి కి అల వైకుంఠపురములో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.