ఎఫ్-3 ట్రిపుల్ కామెడీ..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా ఫుల్ ఫాంలో ఉన్నాడు అనీల్ రావిపుడి. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా 2020 జనవరి 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచారు.   

ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి ఎఫ్-3 సినిమా చేస్తాడని తెలుస్తుంది. రీసెంట్ గా వెంకీమామ సినిమాతో వెంకటేష్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఎఫ్-3 సినిమాలో వెంకటేష్, వర్ణ్ తేజ్ లతో పాటుగా రవితేజ కూడా నటిస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా త్వరలో అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని టాక్. వెంకటేష్ అసురన్, వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలు పూర్తి చేశాక ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.