నితిన్ 'పవర్ పేట'

లవర్ బోయ్ నితిన్ ఈ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటుగా చంద్రశేఖర్ యేలేటి చదరంగం కూడా లైన్ లో ఉంది. భీష్మ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని తెలుస్తుంది. ఇప్పుడు నితిన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు.

కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు పవర్ పేట టైటిల్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఈ సినిమా నిర్మిస్తుంది. వచ్చే ఏడాది కనీసం 3 సినిమాలైనా రిలీజ్ చేసేలా నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. నితిన్ పవర్ పేట టైటిల్ మాసీగా ఉంది. మరి ఈ సినిమాలతో నితిన్ తన రేంజ్ పెంచుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.