హీరోకు తగ్గ విలనే..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 14న ఆ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. యువ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది.   

ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన పూరి విజయ్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకున్నారని టాక్. అయితే హీరోగా కార్తికేయ కూడా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకోగా విజయ్ కు తగిన విలన్ గా కార్తికేయ సత్తా చాటుతాడని చెప్పొచ్చు. మరి పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా కార్తికేయ విలన్ గా చేస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.