
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ప్రతిరోజు పండుగే. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సాయి ధరం తేజ్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాను కూడా మల్టీస్టారర్స్ కు రెడీ అంటున్నాడు ఈ మెగా హీరో. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నాడు సాయి ధరం తేజ్. ఈమధ్య మెగా హీరోలు వరుణ్, సాయి తేజ్ లతో మల్టీస్టారర్ సినిమా అని వార్తలు వచ్చాయి. సరైన కథ దొరికితే వరుణ్ తో సినిమా చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నాడు సాయి ధరం తేజ్.
ఇక ప్రతిరోజు పండుగే సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు. థమన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా వస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కిన సాయి తేజ్ ప్రతిరోజు పండుగే సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.