హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్ సందడి..!

తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న నేపథ్యంలో హింది సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నారు. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ వర్షన్ ఏదో మమా అనిపించే వారు కాని ఇప్పుడు తెలుగు వర్షన్ కోసం ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమా కోసం హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా వెంకటేష్, రాం చరణ్ అటెండ్ అయ్యారు.

వెంకటేష్ తో కలిసి రాం చరణ్, వెంకటేష్ డ్యాన్సులు అలరించాయి. దబాంగ్ 3 సినిమా ఇక్కడ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు సల్మాన్ ఖాన్ తన చిన్న తమ్ముడు రాం చరణ్.. చిరు, వెంకటేష్ లతో పాతికేళ్లుగా తనకు పరిచయం ఉందని ఆయన అన్నారు. ఇక వెంకటేష్, రాం చరణ్ కూడా దబాంగ్ 3 తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.