కమెడియన్ ఆలి ఇంట విషాదం..!

కమెడియన్ ఆలి ఇంటి విషాద ఛాయలు అలముకున్నాయి. ఆలి తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో గురువారం తెల్లవారుఝామున కన్నుమూసినట్టు సమాచారం. జైతున్ బీబీ సొంత ఊరు రాజమండ్రిలో ఉంటున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం కన్నుమూశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆలి ఝార్ఖండ్ లో సినిమా షూటింగ్ లో ఉన్నారు. తల్లి మరణ వార్త విన్న ఆలి వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తున్నారట.

జైతున్ బీబీ భౌతిక ఖాయాన్ని రాజమండ్రి నుండి హైదరాబాద్ తీసుకువస్తారట. హైదరాబాద్ లోనే అంతిమ సంస్కారం జరుగుతాయని సమాచారం. చైల్డ్ ఆర్టిస్టుగా కమెడియన్ గా హీరోగా బుల్లితెర హోస్ట్ గా ఆలి తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నారు. తను ఈ పొజిషన్ కు రాడానికి తల్లిదండ్రులే ప్రధాన కారణమని ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చారు ఆలి.