
ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో హీరో లవ్ ఫెయిల్ అయితే సినిమాలు చూసే వారు కాదు.. కాని ఒక దర్శకుడు హీరో లవ్ ఫెయిల్యూర్ కథతోనే సినిమా తీసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అంతేకాదు హీరో హీరోయిన్ పెళ్లైన తర్వాత సినిమాలకు ఎండ్ కార్డ్ వేస్తారు. కాని ఈ దర్శకుడు అక్కడ సినిమా మొదలు పెట్టి ప్రేక్షకులతో శభాష్ అనిపిస్తాడు. చేసిన రెండు సినిమాలతో తన పంథా వేరని చాటి చెప్పిన దర్శకుడు శివ నిర్వాణ.
ప్రస్తుతం అతను నానితో ఒక సినిమా ఎనౌన్స్ చేశాడు. నాని సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే విజయ్ దేవరకొండ 12వ సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ముహుర్తం పెట్టడం.. షూటింగ్ చేయడం.. హిట్టు కొట్టడం ఎప్పుడు చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు కాని రెండు సినిమాలతో మ్యాజిక్ చేసిన శివ నిర్వాణ హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. నానితో మూడవ సినిమా చేస్తున్న శివ నిర్వాణ ఆ సినిమా హిట్టైతే విజయ్ దేవరకొండ సినిమా మరింత రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంది.