కార్తికేయ 2 అనుపమ ఫిక్సా..?

రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడ్డా సరే నిఖిల్ అర్జున్ సురవరం అతని ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది. కంటెంట్ బాగుంటే సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. ఇక అర్జున్ సురవరం సక్సెస్ ఉత్సాహంతో నిఖిల్ కార్తికేయ 2 షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో కార్తికేయ మూవీ సీక్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.  

ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని తెలుస్తుంది. వరుసగా యువ హీరోలతో చేస్తున్నా సరే అనుపమకు రావాల్సిన క్రేజ్ రావట్లేదు. నిఖిల్ తో అనుపమ మొదటిసారి జోడీ కడుతుంది. లాస్ట్ ఇయర్ తేజ్ ఐలవ్యూ పోయినా హలో గురు ప్రేమ కోసమే సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ ఇయర్ రాక్షసుడుతో కూడా పర్వాలేదు అనిపించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా చేయట్లేదు. కార్తికేయ 2 కచ్చితంగా ఆమెకు లక్కీ ఆఫర్ అని చెప్పొచ్చు.