
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా రితేష్ రానా డైరక్షన్ లో వస్తున్న సినిమా మత్తు వదలరా. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కథ మొత్తం అర్ధమవుతుంది. చిన్నాచితకా జాబులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ముగ్గురు కుర్రాళ్లు దొంగతనం చేయాలని అనుకుంటారు అలా అనుకోవడంతో వారు రిస్క్ లో పడతారు.
ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. సినిమా కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడుస్తుందని అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తుండగా మరో తనయుడు కాళ భైరవ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిశోర్, బ్రహ్మాజి ఈ సినిమాలో నటించారు.