
ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. హీరోగానే కాదు విలన్ గా కూడా రాణిస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ లో స్టైలిష్ విలన్ గా కార్తికేయ అలరించాడు. రీసెంట్ గా 90 ఎం.ఎల్ అంటూ హీరోగా మరోసారి ఫెయిల్ అయిన ఈ యువ హీరో లేటెస్ట్ గా కోలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఖాకి సినిమాతో హిట్ అందుకున్న వినోద్ డైరక్షన్ లో అజిత్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో ముగ్గురు విలన్స్ ఉంటారట. ఒక విలన్ గా కార్తికేయకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. హీరో గానే కాదు విలన్ గా కూడా ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు కార్తికేయ. మాములుగా అయితే హీరోగా చేస్తూ విలన్ గా నటించాలంటే ఆలోచిస్తారు కాని కార్తికేయ మాత్రం అలాంటి ఆలోచనలు ఏమి లేకుండా హీరో కమ్ విలన్ గా చేస్తూ అదరగొడుతున్నాడు. మరి కోలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న కార్తికేయకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.