
అక్కినేని నట వారసుడు అఖిల్ చేసిన మూడు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుందట. పెళ్లి తర్వాత కూడా సూపర్ ఫాం కొనసాగిస్తున్న సమంత నాగ చైతన్యకు లక్కీ అనిపించుకుంది.
ఈ ఇయర్ చైతు కూడా మజిలీ, వెంకీమామ రెండు సినిమాలతో హిట్ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే ప్లాన్ తో ఉన్న అఖిల్ సమంత లక్ కూడా కలిసి రావాలని ఆమెను సినిమాలో భాగం చేస్తున్నాడు. సమంత ఉంటే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. మరి అఖిల్ సినిమాకు ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందో లేదో చూడాలి.