
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉందన్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
సాహో అంచనాలను అందుకోకపోవడంతో జాన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్. సినిమా కొంత భాగం షూటింగ్ అయ్యక కూడా స్క్రిప్ట్ లో మార్పులు సూచించాడట. ఇదిలాఉంటే ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ అనుకుంటే అది కాస్త అక్టోబర్ దాకా వెళ్తుందని తెలుస్తుంది. 2020 దసరా సీజన్ లో అక్టోబర్ 25న అలా ప్రభాస్ జాన్ రిలీజ్ ఫిక్స్ చేశారట. అఫిషియల్ గా ప్రకటించడమే లేటని తెలుస్తుంది. ముందే ప్రకటించడం వల్ల వేరే హీరోల సినిమాలు క్లాష్ అవకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.