చిరు, మహేష్ లపై వెంకటేష్ కామెంట్

విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ. బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్బంగా వెంకటేష్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఫైనల్లీ దేవుడా సక్సెస్ ను ఇచ్చావ్ అంటూ స్పీచ్ మొదలు పెట్టిన వెంకీ యూనిట్ మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డది. ఆ కష్టం తోనే ఈ సక్సెస్ ను అందుకున్నామని అన్నారు వెంకటేష్. ఇక ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సందర్బంగా వారికి థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్. నిన్న చిరంజీవి సినిమా చూశారు ఆయనకు బాగా నచ్చింది. మహేష్ కూడా సినిమా బాగుందని అప్రిషియేట్ చేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటి పాజిటివ్ ఎంకరేజ్ మెంట్ ఉండాలి. పరిశ్రమ అంతా ఓకే తాటిపై రావాలని అన్నారు వెంకటేష్.