.jpeg)
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు సంబందించిన ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులకు సర్ ప్రైస్ ఇస్తుంది. సినిమా లో ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఉండగా లేటెస్ట్ గా జబర్దస్త్ యాంకర్ అనసూయని కూడా ఈ సినిమాలో తీసుకున్నారట. రంగమార్తాండ సినిమాలో అనసూయ స్పైసీ పాత్రలో కనిపిస్తుందట.
జబర్దస్త్ లో తన హాట్ లుక్స్ తో ఆకట్టుకునే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై హాట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి పాత్ర రాలేదు. రంగమార్తాండ సినిమాలో అనసూయ ఉందని ఎనౌన్స్ చేస్తూనే స్పైసీ రోల్ అని చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కృష్ణవంశీ చేతుల్లో పడుతున్న అనసూయకి ఎలాంటి పాత్ర పడుతుందో చూడాలి.