మెగాస్టార్ గెస్ట్ గా సూపర్ స్టార్ ఈవెంట్

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమ రిలీజ్ హంగామా మొదలైంది. రీసెంట్ గా రిలీజైన మూడవ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. 2020 సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఫిక్స్ చేశారు. భరత్ అనే నేను సినిమాకు కూడా ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ సినిమా ఈవెంట్ లో మహేష్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందుకే ఎల్బి స్టేడియం ఎంచుకున్నారు.

ఇక ఇప్పుడు అదే వేదిక సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్లీ మరో స్టార్ అతిథిగా వస్తాడని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట. సరిలేరు నిర్మాతలతో పాటుగా మహేష్ కూడా చిరుని ఇన్వైట్ చేశారట. చిరంజీవి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ మెగాస్టార్ కలిసి ఒకేవేదిక మీద సందడి చేయనున్నారు. అనీల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.