
సౌత్ లో దశాబ్ధ కాలంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు మేడం టుస్సాడ్స్ లో స్థానం సంపాదిచుకుంది. ప్రముఖుల మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచడం గురించి తెలిసిందే. సింగపూర్, బ్యాకాక్, లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉంటాయి. తెలుగు సిని పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ తర్వాత ఆ ఛాన్స్ అందుకుంది కాజల్ అగర్వాల్.
కాజల్ మైనపు విగ్రహం 2020 ఫిబ్రవరి 5న సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించబడుతుందని తెలుస్తుంది. దీనికి సంబందించిన కాజల్ టోటల్ బాడీ కొలతలను మ్యూజియం కు సంబందించిన వారు వచ్చి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ కాజల్ ఉప్పొగిపోతుంది. చిన్నప్పుడు తను సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం కు వెళ్లినప్పుడు అక్కడ స్టాట్యూలు చూసి ఎక్సయిట్ అయ్యానని ఇప్పుడు అక్కడ తన స్టాట్యూ ఉండటం సంతోషంగా ఉందని అన్నది కాజల్. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా ఇప్పటికి చేతినిండా సినిమాలతో కాజల్ తన సత్తా చాటుతుంది.