మెగా హీరోతో నందిని రెడ్డి

మెగా హీరో నుండి త్వరలో ఉప్పెనగా రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్.. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు డైరక్షన్ చేస్తున్నాడు. సాయి ధరం తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ అవకముందే రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడట. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా నందిని రెడ్డి డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఉప్పెన రిలీజ్ అవడమే ఆలస్యం ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట.

ఓ బేబీతో మళ్లీ ఫాంలోకి వచ్చిన నందిని రెడ్డి ఓ క్రేజీ స్క్రిప్ట్ రెడీ చేసిందట. అయితే వైష్ణవ్ తేజ్ ఆమె మొదట ఆప్షన్ కాదట ఒకరిద్దరు యువ హీరోలతో చేయాలని ప్రయత్నించగా అది కుదరకపోవడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తాడని తెలుస్తుంది. ఉప్పెన సినిమా రష్ చూసిన నందిని రెడ్డి తన కథను ఇతను పర్ఫెక్ట్ అనుకుని వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తుంది.