చిరు 152 రిలీజ్ డేట్..!

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహరెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కొరటాల శివ ప్రతి సినిమా రిలీజ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఈ సినిమా రిలీజ్ ముందే నిర్ణయించారు. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని 2020 ఆగష్టు 14న చిరు 152వ సినిమా రిలీజ్ అంటున్నారు. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేశారట. సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖ నేపథ్యంలో ఉంటుందట. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.