
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దర్బార్. తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. రజిని స్టైల్.. మురుగదాస్ టేకింగ్ రెండు కలిపి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానునాయి. ట్రైలర్ తోనే ఈ సినిమా సత్తా ఏంటో చూపించారు. దర్బార్ సినిమాలో మురుగదాస్ రజిని ఎనర్జీని పూర్తిగా వాడినట్టు ఉన్నాడు.
సినిమాలో సూపర్ స్టార్ రజీనికాంత్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఐయాం ఏ బ్యాడ్ కాప్ అంటూ రజిని చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. సినిమాలో విలన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడు. సినిమాలో నివేదా థామస్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంద్. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పోటీని మరింత రసవత్తరంగా మార్చేలా రజిని దర్బార్ ట్రైలర్ ఉంది. సినిమా జనవరి 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.