
సూపర్ స్టార్ మహేష్.. అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి మూడవ సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మిక మీద వచ్చే ఈ సాంగ్ అదిరిపోయింది.
సినిమా పోస్టర్స్ లోనూ టీజర్ లోనూ రష్మికకు అన్యాయం జరుగుతుందని ఆమె ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. ఫైనల్ గా రష్మిక ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేస్తూ హి ఈజ్ సో క్యూట్ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ లో రష్మిక డ్యాన్స్ బాగుంది. మూడు సాంగ్స్ తో దేవి శ్రీ ప్రసాద్ తన సత్తా చాటగా సంక్రాంతికి సరిలేరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు.