నేనా బాలకృష్ణతోనా.. నో వే..!

రూలర్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మిర్యాల రవింద్ర రెడ్డి నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి ఐకాన్ అనే టైటిల్ పరిశీలణలో ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తుందని అంటున్నారు. రెండు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఏకంగా సోనాక్షినే ఈ విషయంపై స్పందించింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నేను హీరోయిన్ గా చేయట్లేదని. తన సినిమాల గురించి అప్డేట్ స్వయంగా తానే ప్రకటిస్తా అంటుంది సోనాక్షి సిన్ హా.

ప్రస్తుతం బాలీవుడ్ లో సోనాక్షి పెద్దగా ఫాంలో లేదు. అలాంటిది బాలయ్య సినిమా ఛాన్స్ వచ్చినా కాదంటుందా అంటే బాలీవుడ్ భామలకు తెలుగు ఛాన్సులు వచ్చినా వారు ఇక్కడ సినిమాల మీద తక్కువ చూపు చూపిస్తారని తెలిసిందే. నిజంగానే సోనాక్షిని పెట్టుకోవాలని అనుకుంటే ఆమె కాదని చెప్పిందో లేదో ఏమో కాని బాలకృష్ణ సరసన సోనాక్షి హీరోయిన్ గా కన్ ఫాం అనుకున్న నందమూరి ఫ్యాన్స్ కు అమ్మడు పెద్ద షాకే ఇచ్చింది.