పూరికి ఫ్యూజు ఎగిరేలా రేటు చెప్పిన జాన్వి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో ఫాంలోకి వచ్చిన పూరి విజయ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. కియరా అద్వాని, జాన్వి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని తెలుస్తుండగా కియరాకి డేట్స్ అడ్జెస్ట్ అవట్లేదని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు జాన్విని అడిగితే అమ్మడు రెమ్యునరేషన్ భారీగా చెబుతుందట. మూడున్నర కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా అంటుందట. జాన్వి డిమాండ్ కు దర్శక నిర్మాతల మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాకు టైటిల్ గా ఫైటర్ అని ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ వస్తుందని తెలుస్తుంది.